Effects of SEZ in Mahabubnagar
మార్కెట్ కంటే ఎక్కువే ఇచ్చాం – కలెక్టరు వివరణ
మహబూబ్‌నగర్ కలెక్టరు వివరణ
కుమిలి.. పోయారు
పౌరహక్కుల సంఘం వెల్లడిసర్కారుపై ధ్వజం
జడ్చర్ల గ్రామీణం – న్యూస్‌టుడే
కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలతో భూములు కోల్పోయి.. నానా బాధ అనుభవించి, రైతులు కుమిలిపోయి మరణిస్తున్నారని, దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి తమ నిజ నిర్ధారణలో తేలిన అంశాలని పౌర హక్కుల సంఘం పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తండాలకు వెళ్లి.. రైతు కుటుంబాలను పరామర్శించారు. సంఘం సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో రఘునాథ్, లింగయ్య, నారాయణరావు, లక్ష్మణ్ తదితరులు వారితో మాట్లాడారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు.
నేడు సెజ్‌పై కలెక్టరేట్ ముట్టడి


