AP farmers highlight opposition to SEZ by fighting elections

13 cultivators contested polls to demonstrate their resentment at acquisition of their land by the government

C.R. Sukumar

Hyderabad: Mala Jangilamma is happy.
The 62-year-old and 12 other farmers who contested the recently held Jadcherla assembly by-elections lost so badly that they forfeited their security deposits. So, why is she so happy?
Jangilamma, Etti Peda Pentaiah, Depalli Yadaiah, Bandapalli Jangamma, Kanduru Mogulaiah, Kanduru Jangaiah and others lost the meagre land they owned — two to eight acres each — to make way for a special economic zone, or SEZ. “Victory or defeat was not the issue. I am elated we could draw the attention of people across the state to our struggle against the SEZ,” says Jangilamma.
Published in:  on June 12, 2008 at 10:37 am Leave a Comment

సెజ్ లు.. రాచరిక వ్యవస్థకు నకళ్లు (Eenadu, 12-5-2008)

Published in:  on May 14, 2008 at 12:37 pm Leave a Comment

TJF Visit To Polepally Sez on 3-05-2008 in eenadu paper

Published in:  on May 6, 2008 at 9:26 am Leave a Comment

మాటల్లో సంక్షేమం, చేతుల్లో సంక్షోభం!

మల్లెపల్లి లక్ష్మయ్య

                    అక్రమంగా అసైన్డ్‌భూములను కలిగివున్నవారికి వాటిని క్రమబద్ధీకరించరాదని ఈ నెల ఒకటవ తేదీన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సవరణను వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లదని, అంతేగాక ఈ సవరణ చట్టం మౌలిక స్వభావానికి విరుద్ధమని ప్రముఖ న్యాయవాది బొజ్జా తార కం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న అసైన్డ్‌ భూములను ఎవరికివారుగా అప్పగిస్తే ఎటువంటి శిక్షలు ఉండవని విధించిన గడుపు ఏప్రిల్‌ 29వ తేదీతో ముగిసింది. కానీ ఎవ్వరూకూడా అప్పగించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గర ఎంత అసైన్డ్‌ భూమి ఉన్నదనే వివరాలను సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలకే పరిమితమైతే కొంత ఆశ కలుగకమానదు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

(more…)

Published in:  on May 5, 2008 at 9:40 am Leave a Comment

Effects of SEZ in Mahabubnagar

 

ఉసురు తీసిన సెజ్
ఒకే గ్రామంలో 25 మంది బలి
తభూమిలోనే కూలీలైన రైతులు
ఎదురుతిరిగినవారిపై కేసులు
జైళ్లలో కుక్కిన యంత్రాంగం
అవమానంతో ఆత్మహత్యలు
జడ్చర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ప్రభావం
ఈయన పేరు బాలు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద పోలేపల్లి రైతు. 16 ఎకరాల ఆసామి. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తన భూమిని సేకరించడాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఇతడిని అరెస్టుచేసి జైలుకు పంపింది. అవమాన భారంతో కుంగిపోయి మరణించాడు. ఇతడే కాదు.. పాతిక మందికిపైగా రైతులు ఇలా భూసేకరణకు బలయ్యారు. రైతులను తమ పొలంలోనే కూలీలుగా మార్చేసి వారి బతుకులను ఛిద్రం చేసిన ఓ ప్రత్యేక ఆర్థిక మండలిపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనంమొన్నటిదాకా 16, 17 ఎకరాల భూస్వాములు వారు. నేడు.. తమ పొలంలోనే కూలీలుగా మారిపోయారు. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) వారి భూముల్ని మింగేసింది. కొందరి ప్రాణాలను కబళించింది. ఇంకొందరి బతుకులను ఛిద్రం చేసింది. ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటికి 25 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.. నమ్ముకున్న భూమిని కోల్పోయిన బాధను తట్టుకోలేక గుండె ఆగి కొందరు చనిపోయారు. తమ సొంత భూమిలోనే కూలీలుగా మారిన అవమానభారంతో ఇంకొందరు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు భూమిని రక్షించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆ అవమానంతో వారిలోనూ కొందరు మంచంపట్టి చనిపోయారు. బతికున్నవారూ తాము కోల్పోయిన భూముల్లోనే కూలీలుగా పనిచేస్తూ జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు.. రాష్ట్ర రాజధానికి దగ్గర్లోని జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. ‘న్యూస్‌టుడే’ ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల దయనీయ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసింది.
Published in:  on at 6:44 am Leave a Comment

సెజ్ ల రద్దులో గోవా దారి………….ఎన్.వేణుగోపాల్

                    ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది.
గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ ఐక్య సంఘటనలో భారతీయ జనతాపార్టీ, గోవా సురాజ్ పార్టీ వంటి రాజకీయపక్షాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. ఈ ఐక్యసంఘటనతోపాటే చర్చి సంస్థలకు అనుబంధంగా ఉన్న ఆక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థ, గోవా బచావ్ అభియాన్ అనే సంస్థకూడ గోవా నుంచి ప్రత్యేక ఆర్థిక మండలాలను పూర్తిగా రద్దుచేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.కొంతకాలంగా సాగుతున్న సెజ్ వ్యతిరేక ఆందోళన డిసెంబర్ చివరి వారంలో తీవ్రరూపం దాల్చింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ పర్యాటకశాఖ మంత్రి మతనీ సల్దానా, జి ఎం ఎ ఎస్ నాయకుడు క్రిస్మస్ తర్వాత తమ ఆందోళనను ఉధృతంచేస్తామని, నూతన సంవత్సర ఉత్సవాలకు గోవాకు వచ్చే పర్యాటకులు వెళ్లిపోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని కూడ హెచ్చరించారు. గోవన్లు తమ పిల్లల భవిష్యత్తు కోసమూ, గోవా ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడడం కోసమూ సంవత్సరాది ఉత్సవాలను త్యాగం చేయవలసి ఉంటుందని కూడ ఆయన పిలుపు ఇచ్చారు.

(more…)

Published in:  on at 6:34 am Leave a Comment

పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?……..ఎన్.వేణుగోపాల్

                           అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, హైదరాబాదునుంచి దక్షిణంగా వెళ్లే జాతీయరహదారిమీద దేశదేశాల సంపన్నుల పెట్టుబడులు ప్రవహించి రాష్ట్రాన్నీ, దేశాన్నీ అందలాలెక్కిస్తాయనీ అమెరికాతో సమానంచేస్తాయనీ ఏలినవారూ వారిబంట్లూ నమ్మబలుకుతున్న దారి పక్కన ఏం జరుగుతున్నదో చూడండి. నిన్నటిదాకా మనుషులు కలకలలాడినచోట సమాధులు లేచి నిలుస్తున్నాయి. అంతులేని విషాదం విస్తరిస్తోంది. పల్లె కన్నీటిధారలు ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి. పచ్చని పంటపొలాలు బహుశా రసాయనాలకంపు కొట్టబోయే మొండిగోడలుగా లేచినిలుస్తూ జీవితాలను కూల్చేస్తున్నాయి. పాలకుల అభివృద్ధి మాయాజాలం నిరుపేదబతుకులను వలవేసి పట్టి మట్టుబెడుతోంది.
Published in:  on at 6:31 am Leave a Comment

ఇదె నిజం…ఈ జీవచ్ఛవాలే సాక్షి

మె పేరు బాలమ్మ.. చేతిలోని చిత్రం భర్త దేపల్లి వెంకయ్యది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం, అటు తర్వాత ఫార్మా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం జరిగిన భూసేకరణలో జీవనాధారమైన భూమి కోల్పోయి.. ఉపాధి కరవై.. కుటుంబాన్ని పోషించలేక పుట్టెడు దిగులుతో వెంకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ‘ఉసురు తీసిన సెజ్‌’ శీర్షికన ఈనెల 18న ‘ఈనాడు’ రాసింది ఈయన గురించి. వైఎస్‌ తనయుడి పత్రిక ‘సాక్షి’.. ఆ వూళ్లో ఇద్దరే వెంకయ్యలున్నారని, ఇంకెవరూ లేరని బొంకింది. మరి ఈ వెంకయ్య భార్య బాలమ్మకేం సమాధానం చెబుతుంది? వీరికి ఎకరా భూమి ఉంది. దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక ఆర్థిక మండలికి ఇచ్చింది. ఉన్న ఎకరా పోవడంతో ఇక ఎలా బతుకుతామని దిగులుపడి తన భర్త మరణించాడని బాలమ్మ రోదిస్తూ శుక్రవారం తనను కలిసిన ‘న్యూస్‌టుడే’ ప్రతినిధికి చెప్పింది.
Published in:  on at 6:27 am Leave a Comment

మార్కెట్‌ కంటే ఎక్కువే ఇచ్చాం – కలెక్టరు వివరణ

ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే జడ్చర్లలో భూ సేకరణ
రైతుల మరణాలపై పరిశీలన చేయలేదు
మహబూబ్‌నగర్‌ కలెక్టరు వివరణ

మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే:

 
                     మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపురం గ్రామాల్లో ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే అభివృద్ధి కేంద్రం (గ్రోత్‌ సెంటర్‌) కోసం భూ సేకరణ చేశామని జిల్లా కలెక్టరు ఉషారాణి తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించేలా భూ సేకరణ చేపట్టలేదని స్పష్టంచేశారు. చనిపోయిన రైతులకు సంబంధించిన సమాచారమేదీ అధికారుల వద్ద లేదన్నారు. ఆ మరణాలు ఎలా జరిగాయో.. ఎందుకు జరిగాయో పరిశీలించలేదని ఆమె శనివారమిక్కడ విలేఖరులకు తెలిపారు.
Published in:  on at 6:16 am Leave a Comment

‘గూడు’కట్టని నిర్లక్ష్యం!

ఇళ్ల స్థానంలో బోర్డు మిగిలింది
ఉపాధీ ఎండమావే
పోలేపల్లి సెజ్‌ నిర్వాసితుల దుస్థితి
——————————————————————————–
పోలేపల్లి నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి

పోలేపల్లి పోలేపల్లి ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్‌) కోసం భూమిని ధారపోసిన అభాగ్యులు అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. వారికిచ్చిన హామీలు ఆచరణకు ఆమడదూరంలో ఉండిపోతున్నాయి. సెజ్‌ కారణంగా నిర్వాసితులయ్యే వారికి 200 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఘనంగా హామీ ఇచ్చింది. అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ఇళ్లకోసం స్థలం కేటాయించినట్లు సూచిస్తూ బోర్డు మాత్రం ఆర్భాటంగా పాతారు. అంతకుమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఉపాధి కల్పనకు ఇచ్చిన హామీ కూడా ఎండమావిగా మారుతోంది.మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద 969 ఎకరాలను 2003లో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) సేకరించింది.

Published in:  on at 6:07 am Leave a Comment

కుమిలి.. పోయారు

జడ్చర్ల సెజ్‌ మృతులు 40 మంది!

పౌరహక్కుల సంఘం వెల్లడిసర్కారుపై ధ్వజం

జడ్చర్ల గ్రామీణం – న్యూస్‌టుడే
                కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలతో భూములు కోల్పోయి.. నానా బాధ అనుభవించి, రైతులు కుమిలిపోయి మరణిస్తున్నారని, దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి తమ నిజ నిర్ధారణలో తేలిన అంశాలని పౌర హక్కుల సంఘం పేర్కొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తండాలకు వెళ్లి.. రైతు కుటుంబాలను పరామర్శించారు. సంఘం సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రఘునాథ్‌, లింగయ్య, నారాయణరావు, లక్ష్మణ్‌ తదితరులు వారితో మాట్లాడారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు.

(more…)

Published in:  on at 6:03 am Leave a Comment

నేడు సెజ్‌పై కలెక్టరేట్‌ ముట్టడి

 

జడ్చర్ల, ఏప్రిల్‌ 27 (న్యూస్‌టుడే):

                పోలేపల్లి సెజ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నట్లు భాజపా జాతీయ కిసాన్‌ మోర్చా సభ్యుడు డా.శౌరీ తెలిపారు. ఆదివారం జడ్చర్ల భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

(more…)

Published in:  on at 5:48 am Leave a Comment

SEZ displaced cup of woes overflows

——————————————————————————–
Land from Polepally, Mudireddypally villages assigned to SEZ
Rs. 18,000 an acre for assigned lands too less for livelihood.
——————————————————————————–
Nowhere to go: Widows of Polepally village whose lands have been acquired pour out their woes at a meeting in Hyderabad on Sunday.

HYDERABAD: “We have lost dignity along with livelihood. Not a sliver of land is left even to bury us after death. We fear nothing now as we stand to lose nothing,” Sukkamma, a woman from Polepally village of Mahbubnagar district says fuming with rage.

Published in:  on at 5:45 am Leave a Comment

SPECIAL ECONOMIC ZONES

By –

Sujatha Surepally

                  SEZs. Horrible, inhuman, mad development zones one can ever imagine. I dont know how many of us aware of these so called SPECIAL ECONOMIC ZONES as it translates into reality on the ground. I don?t know the theory part of this madness. Andhra Pradesh stands second in the country to accommodate SEZs.

(more…)

Published in:  on May 3, 2008 at 6:50 am Leave a Comment