ఇదె నిజం…ఈ జీవచ్ఛవాలే సాక్షి

మె పేరు బాలమ్మ.. చేతిలోని చిత్రం భర్త దేపల్లి వెంకయ్యది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం, అటు తర్వాత ఫార్మా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం జరిగిన భూసేకరణలో జీవనాధారమైన భూమి కోల్పోయి.. ఉపాధి కరవై.. కుటుంబాన్ని పోషించలేక పుట్టెడు దిగులుతో వెంకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ‘ఉసురు తీసిన సెజ్‌’ శీర్షికన ఈనెల 18న ‘ఈనాడు’ రాసింది ఈయన గురించి. వైఎస్‌ తనయుడి పత్రిక ‘సాక్షి’.. ఆ వూళ్లో ఇద్దరే వెంకయ్యలున్నారని, ఇంకెవరూ లేరని బొంకింది. మరి ఈ వెంకయ్య భార్య బాలమ్మకేం సమాధానం చెబుతుంది? వీరికి ఎకరా భూమి ఉంది. దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక ఆర్థిక మండలికి ఇచ్చింది. ఉన్న ఎకరా పోవడంతో ఇక ఎలా బతుకుతామని దిగులుపడి తన భర్త మరణించాడని బాలమ్మ రోదిస్తూ శుక్రవారం తనను కలిసిన ‘న్యూస్‌టుడే’ ప్రతినిధికి చెప్పింది.
Published in:  on May 5, 2008 at 6:27 am Leave a Comment

సాక్షి దినపత్రిక నుంచి…

Published in:  on at 6:23 am Leave a Comment